గొల్లప్రోలు మే 4 మన న్యూస్ :-పిఠాపురం నియోజకవర్గం లోని పిఠాపురం పట్టణంలో సాయిప్రియ సేవా సమితి ఆధ్వర్యంలో 144 వారం కూడా నిరుపేద అన్నదాతలకు అన్నదానం యథాతథంగా జరిగింది.డొక్కా సీతమ్మ అన్నదానం ను స్పూర్తితో, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి వారం భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.జ్యోతుల శ్రీనివాస్ వ్యక్తి గత కార్యదర్శి మేకల కృష్ణ ఈ కార్యక్రమ పర్యవేక్షణలో వందలాది మంది రైతులకు, బాటసారులకు మహా అన్నదానం నిర్వహిస్తున్నారు.నిత్యం ప్రతీ వారం అన్నదానం అందిస్తూ కడుపు నింపుతున్న సాయిప్రియ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల గంగాభవాని శ్రీనివాస్ ను ఆ భగవంతుడు చల్లగా చూడాలని ఆశీర్వాదిస్తున్నారు.ఈ కార్యక్రమంలో సాయిప్రియ సేవా సమితి కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.