మన న్యూస్, కోవూరు, మే 4: - 11 నెలల వ్యవధిలో 10 విడతలుగా 153 మంది అనారోగ్య పీడితులను CMRF ద్వారా ఆదుకున్నాం.కోవూరు నియోజకవర్గ పరిధిలో CMRF ద్వారా 2 కోట్ల12 లక్షల 73 వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ధన్యవాదాలు-ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందివ్వాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుట్ లోని తన కార్యాలయంలో ఆమె కోవూరు నియోజకవర్గ పరిధిలో 6 గురికి 6 లక్షల 46 వేల 553 వందల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందచేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ……. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన 11 నెలలు వ్యవధిలో 153 మంది అనారోగ్య బాధితులకు 2 కోట్ల12 లక్షల 73 వేల రూపాయలు CMRF ద్వారా ఆర్ధిక సహాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేనన్నారు. అనారోగ్యాల బారిన పడి కష్టాలలో వున్న కుటుంబాలకు CMRF ఆర్ధిక సహాయం కొండంత అండగా నిలుస్తుందన్నారు. CMRF నిధుల ద్వారా వేలాది కుటుంబాలను ఆదుకుంటూ మానవత్వం చాటుకుంటున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని ఆమె కొనియాడారు. CMRF పధకం ద్వారా నిరుపేదలకు ఆర్ధిక భరోసా అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి కోవూరు ప్రజానీకం తరుపున ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధన్యవాదాలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇంత మల్లారెడ్డి, బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, మోర్ల మురళి తదితరులు పాల్గొన్నారు.