మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 4:- నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ. 41 కోట్ల వ్యయంతో చేపట్టి చెప్పిన మాటకు కట్టుబడి 60 రోజులలో పూర్తి చేసిన 339 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ మహోత్సవం జరుగుతుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.ఒకే సమయానికి 339 అభివృద్ధి పనులు 678 మంది పార్టీ నాయకుల, కార్యకర్తల చేత ప్రారంభోత్సవం చేస్తారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మే 15వ తేది ఉదయం 09:00గం.లకు కల్లూరుపల్లి హోసింగ్ బోర్డు కాలనీ మెయిన్ రోడ్డు సిమెంట్ రోడ్డుని రాష్ట్ర మునిసిపల్ శాఖామాత్యులు పొంగూరు నారాయణ , నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు శాసన మండలి సభ్యులు బీద రవిచంద్ర చేతులు మీదగా ప్రారంభించటం జరుగుతుంది అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఇందులో వివిధ శాఖల అధికారులు..కూటమి పార్టీల నేతలు.. ఒక పని వద్ద ఇద్దరు టిడిపి కార్యకర్తలు పాల్గొంటారు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా కూడా ఒకే నియోజకవర్గంలో ఒకే రోజు ఇన్ని ప్రారంభోత్సవాలు చేయలేదు అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ శాఖల కింద జరుగుతున్న మరియు పూర్తయిన అభివృద్ధి పనుల విలువ రూ. 231.కోట్ల 78 లక్షలు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కొండాయపాలెం, భక్తవత్సల నగర్ లలోని రైల్వే గేట్ అండర్ బ్రిడ్జిల పనులను త్వరలోనే ప్రారంభిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు. ఇంతటి అద్భుత అవకాశాన్ని నాకు కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ కి మరియు యువ నాయకుడు నారా లోకేష్ కి నా కోసం కష్టం చేసి, నన్ను మూడవసారి ఎమ్మెల్యే చేసిన నాయకులకు, కార్యకర్తలకు, నాకు ఓటు వేసి గెలిపించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలియజేశారు.