మన న్యూస్,నిజాంసాగర్:( జుక్కల్ ) నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట్ గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.ఇందులో భాగంగా ఆదివారం భక్తులు ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు.అలాగే ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.సోమవారం భజన కీర్తనలు,6 న ఎడ్లబండ్ల ప్రదర్శన,బోనాలు,భాగవత కార్యక్రమాలు,7న కుస్తీ పోటీలు రథోత్సవం ఉంటాయని ఆలయ కమిటీ సభ్యులు బంగ్లా ప్రవీణ్ కుమార్ తెలిపారు.నాలుగు రోజులపాటు జరిగే జాతర సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.కుస్తీ పోటీలు,రథోత్సవం కు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.