మన న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండలో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టును నేడు ఆదివారం ఉదయం 9:30 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, ప్రకాశం జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి తర్లాడ రాజశేఖర్ రావు హాజరై కోర్టును ప్రారంభించనున్నారు.
ప్రత్యేక అతిథులుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు డా. జస్టిస్ కె. మణ్మధ రావు, గౌ. జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, గౌ. డా. జస్టిస్ వై. లక్ష్మణ రావు లు పాల్గొననున్నారు.
ఈ కార్యక్రమానికి బార్ అసోసియేషన్, సింగరాయకొండ అధ్యక్షులు ఎస్. శ్రీనివాసులు మరియు ప్రకాశం జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గౌ. ఎ. భారతీ గారు ఆహ్వానం అందజేశారు.
ఈ కొత్త కోర్టు ప్రారంభం ద్వారా సింగరాయకొండ పరిసర ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా, సమర్థవంతంగా అందుబాటులోకి రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.