వెదురుకుప్పం,మన న్యూస్ , మే 3: వెదురుకుప్పం మండలంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ మోహన్ మురళి జన్మదిన వేడుకలు శుభకార్యంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ వి. ఎం. థామస్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేక్ కట్ చేసి, మోహన్ మురళికి తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మురళికి ఆశీర్వచనాలు అందిస్తూ, పార్టీకి అందించిన సేవలను ప్రశంసించారు. ఈ వేడుకలో నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమం ఆహ్లాదకర వాతావరణంలో ముగిసింది