ఎస్ఆర్ పురం,మన న్యూస్… ఎస్ఆర్ పురం మండలం చిన్న తయ్యూరు కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు కల్వరి మౌంట్ లో శనివారం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కల్వరి మౌంట్ ఉత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ థామస్ మాట్లాడుతూ ఈ చర్చికి రావడానికి దారి సరిగా లేదు మొదటగా ఇక్కడికి సిమెంటు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తాను ఈ కల్వరి మౌంట్ ఫ్యామిలీ ఫెస్టివల్ ఉత్సవానికి ఏ అవసరం వచ్చినా నేను వాటిని పరిష్కరిస్తాను అలాగే కల్వరి మౌంట్ లో పొజిషన్ సర్టిఫికేట్ తీసి ఇచ్చే బాధ్యత నాదే అని ఎమ్మెల్యే డాక్టర్ థామస్ తెలిపారు అలాగే ఇక్కడ ఇంతమంది పాస్టర్లను వారి కుటుంబ సభ్యులను కల్వరి మౌంట్ లో కలవడం నాకెంతో సంతోషంగా ఉందని తెలియజేశారు అనంతరం ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సుమారు 5000 మంది క్రైస్తవులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డీఎస్ సౌందర్య పండియన్ పాస్టర్ మాథ్యూ, పాస్టర్ అన్బుదాస్ వినోద్ కుమార్, ఏసుమణి,వినయ్, జాన్ సాల్మన్ యేసు రత్నం సతీష్ సురేష్ యాకోబ్ పరదేశి ప్రకాష్ ఉపదేశకులు పాల్గొన్నారు.