మన న్యూస్, నారాయణ పేట:- మక్తల్ మండలంలోని అనుగొండ గ్రామంలో ఈనెల 7వ తేదీన లయన్స్ క్లబ్ మక్తల్ ఆధ్వర్యంలో లయన్స్ డిస్ట్రిక్ట్ సెకండ్ గవర్నర్ శశికాంత్, లక్ష్మణ్ సహకారంతో మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశామని, ఈ సందర్భంగా అనకొండ గ్రామం తోపాటు చిట్టుపక్కల గ్రామాల ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని లయన్స్ క్లబ్ మక్తల్ అధ్యక్షుడు టీవీ చారి సూచించారు. మెగా వైద్య శిబిరం కు సంబంధించి కరపత్రాలను మక్తల్ లయన్స్ క్లబ్ ఆవరణలో లైన్స్ బృందం సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,మెగా వైద్య శిబిరంలో మలక్పేట యశోద హాస్పిటల్ వైద్య సిబ్బందితోపాటు అన్ని విభాగాలకు సంబంధించి ఇతర వైద్య నిపుణులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రజలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ లయన్స్ క్లబ్ సభ్యులు రాములు, లక్ష్మణ్, మఖ్తల్ లయన్స్ క్లబ్ కోశాధికారి అంజన్ ప్రసాద్, అనుగొండ శ్రీనివాస్, సూగురు జైపాల్ రెడ్డి, నాగరాజు, మామిళ్ల పృథ్వీరాజ్, శరణప్ప, రవికుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.