వెదురుకుప్పం, మన న్యూస్ , మే 3: చవటగుంట గ్రామంలో శ్రీకృష్ణ ధర్మరాజుల 45వ మహాభారత ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఆలయ ప్రాంగణం ప్రజలతో కిటకిటలాడింది. ఈ ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే డాక్టర్ థామస్ కి గ్రామ పెద్దలు మరియు స్థానికులు ఘన స్వాగతం పలికారు. మోహన్ మురళి స్వయంగా డాక్టర్ థామస్‌ను ఆలయ నికి స్వాగతం పలికి తీసుకెళ్లారు. తదుపరి కార్యక్రమంలో చవటగుంట ద్రౌపతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించబడ్డాయి. ఇందులో ఎమ్మెల్యేతో పాటు జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పొన్న యుగంధర్, ఇతర కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. పూజల అనంతరం ఎమ్మెల్యే గ్రామ భక్తులకు శుభాకాంక్షలు తెలుపుతూ మహాభారత ఉత్సవాల ఆధ్యాత్మికతను కొనియాడారు. ఉత్సవాలను ప్రతీ ఏడాది ఇంకా భవ్యంగా నిర్వహించాలని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి దైవదర్శనం చేసుకున్నారు.