ఎల్ బి నగర్. మన న్యూస్ :- జడ్జెస్ కాలనీ ఫేస్ వన్ లో వేంచేసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ బంగారు పోచమ్మ తల్లుల దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల నాల్గవ తేదీన దేవాలయం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా నూతన ఆలయ నిర్మాణ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం ఎల్బీనగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదుగా జరిగింది.ఇట్టి కార్యక్రమంలో జడ్జెస్ కాలనీ అధ్యక్షులు అంజయ్య గౌడ్,కార్యదర్శి బాలయ్య,కోశాధికారి రంగారెడ్డి మరియు పలు దేవాలయాల కమిటీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.