శంఖవరం మన న్యూస్ (అపురూప్): కూటమి ప్రభుత్వం మహిళా సాధికారతకు కృషి చేస్తుందని, జీవితంలో ప్రతి అడుగులోనూ నెమరు వేసుకుంటూ ముందడుగు వేయాలని టీడీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ సూచించారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజవర్గం మండల కేంద్రమైన శంఖవరం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ శంఖవరం సెక్టర్ లో మండల స్థాయిలో శంఖవరం సచివాలయం నందు సిడిపిఓ టి డి ఆర్ పద్మావతి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం శిక్షణ లో భాగంగా బేటి బచావో బేటి పడావో కౌమార బాలికల సాధికారత వైపు పయనం 11-18 సo.ల ఆడ పిల్లలకు వేసవి శిబిరం కార్యక్రమం నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ఐసిపిఎస్ ప్రొడక్షన్ అధికారిని (ఎన్ఐపిఎస్) జాగారపు విజయ మాట్లాడుతూ, కౌమార బాలికలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పోషకాహార లోపాలు, గర్భం, మరియు లైంగిక హింస. కౌమార బాలికల కోసం ప్రభుత్వాలు మరియు సామాజిక సంస్థలు సహాయ కార్యక్రమాలు మరియు పథకాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కౌమార బాలికలు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు పోషకాహార లోపాలు అని కౌమార దశలో బాలికలకు అవసరమైన పోషకాలు అందకపోతే, వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని, కౌమార దశలో గర్భం చాలా ప్రమాదకరమైనదని, దీనివల్ల తల్లి మరియు బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ముప్పుందన్నారు.కౌమార బాలికలు లైంగిక హింసకు గురికావడం చాలా సాధారణం. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. కొంతమంది కౌమార బాలికలకు విద్య మరియు పనికి వెళ్లడం కష్టంగా ఉంటుందని, కౌమార దశలో బాలికలు అనేక ఒత్తిడి మరియు మానసిక సమస్యలను ఎదుర్కొంటారు.మరియు ఇతర సామాజిక సమస్యలు బాల్య వివాహాలు, కుటుంబంలో హింస, పేదరికం మొదలైనవి కౌమార బాలికల జీవితాలను ప్రభావితం చేస్తాయని అన్నారు. అనంతరం కూటమి నాయకులు బద్ది రామారావు, పర్వత సురేష్, వెన్న ఈశ్వరుడు (శివ) మేకల కృష్ణ మాట్లాడుతూ, కౌమార బాలికల సాధికారత వైపు పయనం, కౌమరా బాలికల సమస్యలు, నా పోసన అవసరాలు, ఆరోగ్యవంతమైన నేను, పిల్లల సంరక్షణ మానవ అక్రమ రవాణా పోక్స్ చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, ఆత్మరక్షణ వంటి విషయాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలపై వెలుగు సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు. బాల్య వివాహాలను గుర్తించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం శంఖవరం ఐసిడిఎస్ సెక్టర్ సూపర్వైజర్లు అరుణశ్రీ, రజిని, శంఖవరం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎస్ఎస్ రాజీవ్ కుమార్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణం సుబ్రహ్మణ్యం, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు గాబు సుభాష్, గ్రామ టీడీపీ నాయకులు బుర్ర వాసు, వైద్య సిబ్బంది, వెలుగు సిబ్బంది, మండలంలో గల మహిళా పోలీసులు, భారీ సంఖ్యలో అంగన్వాడీ కార్యకర్తలు, పాల్గొన్నారు.