కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: మే 02: బద్వేలు మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని తిరువెంగలపురం హెల్త్ వెల్నెస్ కేంద్రం నందు కిసార్ వికాస్ 10-19 యుక్త వయస్సు ఉన్నటువంటి బాలికలకు పోషకాహారం గురించి వ్యక్తిగత పరిశుభ్రత గురించి ఆరోగ్య విద్య ద్వారా అవగాహన కల్పించి భారత ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ఈనెల రెండవ తారీకు నుంచి జూన్ 10వ తారీఖు వరకు కిషోర్ వికాసాన్ని ప్రోగ్రాం కింద 10-19 సంవత్సరాల వయస్సు వారికి ఆరోగ్యం పైన పునరుత్పత్తి పైన పోషకాహారం పైన అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇవ్వడమైనది అందుకు అనుగుణంగా ఈరోజు అనగా 2 /5/2025 వ తేదీన గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలలో కిషోర్ బాలికల అందరినీ పరిచయం చేసుకొని వారి ఆహారం అలవాట్లు గురించి ఫోషకాహారం గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి తెలుసుకొని వారికి ఆరోగ్యం పైన మరియు పోషకాహారం పైన అవగాహన కార్యక్రమం కల్పించడం. ఈ కార్యక్రమంలో హెల్త్ వెడికేటర్ బి వెంగయ్య కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ చంద్రవతి, హెల్త్ సూపర్వైజర్ కే వెంకటమ్మ మరియు ఐసిడిఎస్ సూపర్వైజర్స్ సువరణ మరియు అంగన్వాడి సెంటర్ అంగన్వాడి టీచర్స్ ఆశా కార్యకర్తలు పి నాగమ్మ మహాలక్ష్మ తెలుగువారు పాల్గొనడం అయినది.