మన న్యూస్ సాలూరు మే 2:= పార్వతిపురం మన్యం జిల్లా పాచిపెంట మండలంలో రాష్ట్ర మన్యం బందు ఆదివాసి గిరిజన సంఘం చేపట్టిన సందర్భంగా పాచిపెంట మండల కేంద్రంలో ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు భూతాల శాంతి కుమార్ మర్రి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగింది. అలాగే బొరమామిడి పంచాయితీ పూతిక వలస గరువు వద్ద ఆదివాసి గిరిజన సంఘం నాయకులు పోయి రామారావు పోయి గంగరాజు చిన్నారావు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఈ బంద్ కార్యక్రమం జయప్రదం చేయాలని జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేయాలని 100% గిరిజన ప్రాంత ఉద్యోగాలు గిరిజనకే ఇవ్వాలని ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులు మెగా డీఎస్సీ నుండి మినహాయించాలని అన్నారు.గిరిజన స్పెషల్ డిఎస్సీకి ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఈ బందు కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం చేస్తున్న బందుకు సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరాడ ఈశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెగా డీఎస్సీ తో పాటు స్పెషల్ డిఎస్సీ తేవాలని జీవో నెంబర్ త్రీ ని పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు షెడ్యూలు ప్రాంతాల్లో కూడా గిరిజనులకు హక్కులు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో జీవో నెంబర్ త్రీ ని పునరుద్ధరణ చేయకపోతే గిరిజనులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జీవో నెంబరు 3ని కొనసాగించి ఉద్యోగ భద్రత కొనసాగు ఇస్తామని చెప్పి ఈరోజు మరల కూటమి ప్రభుత్వం ఈ విధంగా మాట మార్చి జీవో నెంబర్ త్రీ ని రద్దు చేస్తూ గిరిజనులకు భద్రత లేకుండా చేయడం సరైంది కాదని. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీ ఏజెన్సీ ఐటీడీఏ పరిధిలో 766 పోస్టుల్లో ఆదివాసులకు దక్కేది కేవలం 42 పోస్టులు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు. 94% నివాసం ఉన్న గిరిజనులకు ఆరు శాతం ఉద్యోగాలు ఆరు శాతం నివాసం ఉన్న గిరిజన యాత్రలకు 94% ఉద్యోగాలు కేటాయించడానికి ఈరోజు తీవ్రంగా ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ఖండిస్తోంది దానికి సంపూర్ణంగా సిపిఎం మద్దతు తెలియజేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పోరాటంకి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి జీవో నెంబర్ త్రీ ని కొనసాగించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని, గిరిజనులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి ప్రజా సంఘాలన్నీ కూడా మద్దతు తెలపాలని అన్నారు. భవిష్యత్ పోరాటాలకు గిరిజనులు చేసిన పోరాటాలకి ప్రజలంతా అండగా ఉండాలని కోరారు.