మన న్యూస్ ,కోవూరు ,మే 2;:- ముఖ్య అతిధిగా విచ్చేసిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కి అపూర్వ స్వాగతం పలికిన పల్లిపాళెం వాసులు. ఇందుకూరుపేట మండలం పల్లిపాళెం గ్రామంలో మరో మూడు రోజులలో ప్రతిష్టించనున్న సీతారామ స్వామి అమ్మవార్ల విగ్రహలకు వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సీతారామ స్వామి అమ్మవార్ల విగ్రహ పూజల పుణ్య కృతువులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల విగ్రహాలకు పవిత్ర జలాలు, పుష్పాలు చెల్లుతూ సాగిన ప్రత్యేక పూజలో పాల్గొని ఆమె వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ శ్రీ సీతారాములు స్వామి అమ్మవార్ల ఆశీర్వాదాలతో గంగపట్నం పల్లిపాళెం సుభిక్షంగా వుండాలని పల్లిపాళెం వాసులు ఆయురారోగ్యాలతో వుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు దువ్వూరుకళ్యాణ్ రెడ్డి, రావెళ్ల వీరేంద్ర నాయుడు, కోడూరు కమలాకర్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి స్థానిక నాయకులు వెంకట రమణారెడ్డి, హరికృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.