మన న్యూస్, నెల్లూరు రూరల్ ,మే 2:- నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 31వ డివిజన్ అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి, స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి . టిడ్కో గృహాల దగ్గర అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించిన అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అక్కచెరువుపాడు టిడ్కో ఇళ్ల దగ్గర బోర్లు, లైట్లు మరియు డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా టిడ్కో గృహవాసులు అందరూ ఒక కుటుంబంలా కలిసి మెలిసి ముందుకు సాగండి అని నెల్లూరురూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.స్థానిక శాసన సభ్యుడిగా అక్కచెరువుపాడు టిడ్కో గృహవాసుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల టిడిపి నాయకులు బత్తల కృష్ణ, పల్నాటి మస్తాన్ నాయుడు, కూకాటి హరిబాబు, ఉమామహేశ్వరరావు, శశిధర్ రెడ్డి, యానాదయ్య, ఓబుల్ రాజు, టి.వి.ఎస్.కమల్, ఖాదర్ బాషా, కరిముల్లా, సురేష్, మురళి నాయుడు, శ్రీనివాసులు, ఉదయ్, కరీమా, దొరసానమ్మ, దేవసేన, షఫీ, జిన్ను, మోబినా, అనిల్, కోటేశ్వరరావు, అల్లం దేవదాస్, మస్తానయ్య, శ్రావణ్, కమాలుద్దీన్, కృష్ణయ్య, హరి, ప్రసాద్ నాయుడు, సుధా, జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.