మన న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా అంతరించిపోతున్న పౌరాణిక నాటక ప్రదర్శనలను ప్రజలకు చేరువయ్యే రీతిలో తెలంగాణ రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ కృషి చేస్తున్నది. శ్రీ జోగులాంబ గద్వాల జిల్లా రంగస్థలం కళాకారుల సంఘం వారి ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ మామిడి హరికృష్ణ ప్రోత్సాహంతో గద్వాలలోని బాల భవన్లో ఆదివారం నుండి మంగళవారం వరకు వివిధ పౌరాణిక నాటక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం పడక సీను ప్రదర్శనలో ఎలుకూరు శరణప్ప శ్రీకృష్ణుడిగా ప్రదర్శనలు ఆకట్టుకున్నారు. అర్జునుడిగా బీసన్న, మద్దిలేటి దుర్యోధనుడిగా వారి కళా ప్రదర్శనను నిర్వహించారు. అలాగే చింతామణి భవాని శ్రే, శ్రీ రామాంజనేయ యుద్ధ సీను, గయోపాఖ్యానం యుద్ధ సీ, సుభద్రా రాయబారం, కర్ణ రహస్యం ప్రదర్శనలు నిర్వహించారు. సోమవారం మయసభ పడక సీ, చింతామణి భవాని సీ, శ్రీ రామాంజనేయ యుద్ధం ప్రదర్శనలు జరుగుతాయని తెలిపారు. అలాగే మంగళవారం కూచిపూడి నృత్యాలు సినీ సంగీత విభావరి, చింతామణి భవాని సీను, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర ప్రదర్శనలు ఉంటాయని రంగస్థల కళాకారుల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారని, అలాగే మల్దకల్ దేవాలయం చైర్మన్ శ్రీకృష్ణ మాన్య పట్వారి ప్రహ్లాద రావు హాజరు అవతారని తెలిపారు.