శంఖవరం మన న్యూస్ (అపురూప్) : ప్రకృతి వ్యవసాయ పద్ధతులతోనే నేల సారవంతంగా ఉంటుందని మండల నాయకులు పర్వత సురేష్ రైతులకు సూచించారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ప్రణాళిక ఖరీఫ్ - 2025 లో భాగంగా రైతులతో శంఖవరం రైతు సేవా కేంద్రo- 3లో రైతులకు అవగాహన కల్పించారు. నేల సారవంతంగా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయ పద్ధతులు గూర్చి రైతులకు సిబ్బంది అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఎక్కువ మంది రైతులను ప్రోత్సహించాలని సూచించారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతులు,నవధాన్యాల సాగు,పెరటి తోటల పెంపకం,మిద్దె వ్యవసాయం,మిశ్రమ వ్యవసాయం ,వివిధ కషాయాల తయారీ వంటి అంశాలపై రైతులకు వ్యవసాయ అధికారి పి గాంధీ అవగాహన కల్పించారు.ప్రకృతి వ్యవసాయ పద్ధతులలో పండించే పంటలకు మార్కెట్ లో ధర ఎక్కువగా ఉంటుందని నాయకులు మేకల కృష్ణ రైతులకు సూచించారు.రైతులకు వారి పంటలకు అవసరమైన వివిధ రకాల కషాయాలు అందుబాటులో ఉన్నాయని సి ఆర్ పి సోమరాజు వివరించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ఆచరిస్తున్న ఆదర్శ రైతులకు, మహిళలకు సన్మానించి గౌరవించారు.రైతులకు నవధాన్యాల కిట్లు అందజేశారు.రైతులు, మహిళలు,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.