మన న్యూస్, నెల్లూరు ,మే 1 :- పెద్దలు చెప్పినట్లు శ్రమని గుర్తిద్దాం,శ్రమను చేద్దాం,శ్రమను గౌరవిద్దాం…అని ప్రతి ఒక్కరూ ప్రతినపూనాలి. మే డే సందర్భంగా నెల్లూరు సిటీ పాత మున్సిపల్ హాస్పిటల్ వద్ద నిర్వహించిన మెడికల్ క్యాంపులో తెలుగుదేశం నాయకులు పట్టాభిరామిరెడ్డి,టిఎన్టియుసి నాయకులు కళ్యాణ్,యువరాజ్, మరియు ఇతర కార్మికుల నాయకులతో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల కలిసి పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……శంఖుస్తాపన వచ్చి రోడ్ల నిర్మాణంలో,భవన నిర్మాణంలో రిబ్బన్ కట్ చేసిన నాయకులను ఎంతమందినో చూశాను వీటన్నిటికీ కారణం శ్రామికులే అని పిలిచి సన్మానం చేసిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తాం అని అన్నారు.పనికి వేతన కూలీలు అనే మాట ఇబ్బందికరంగా ఉంది.. పనికి వేతన శ్రామికులు అనండి అంటూ శ్రామికుల గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో ఉండటం సంతోషంగా ఉంది.ముఖ్యంగా అంతర్జాతీయ మేడేని శ్రామికుల శ్రామికుల హక్కులు తెలియజేసే విధంగా పనికి కనీస వేతనాన్ని పొందే హక్కు…. సురక్షితమైన పని పరిస్థితులు కల్పించే హక్కు…సామాజిక భద్రత హక్కు…పనిచేసే ప్రదేశాల్లో వివక్ష ఎదుర్కోకూడదని హక్కు… యూనియన్లు ఏర్పాటు చేసే హక్కు… యూనియన్ లో చేరే హక్కు… ఈ వేడుక నిర్వహించాలని కోరారు. ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవం నాడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధికి అనేక పనులు కల్పించి శ్రామికులకు చేత నిండా పనులు కల్పించారు అని అన్నారు. కార్మిక దినోత్సవ సందర్భంగా చేతి నిండా పని తో జేబు నిండా డబ్బులు కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. జిల్లా పరిరక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ పర్యవేక్షణలో శ్రామికుల సమస్యలు ఏదైనా పరిష్కరించేందుకు జనసేన పార్టీ తరఫున ముందుంటారని తెలియజేశారు.