మన న్యూస్, తిరుపతి:- పేదలను ఆర్థికంగా ఆదుకోవడానికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. బుధవారం ఉదయం కొర్లగుంట సంజయ్ గాంధీ కాలనీలోని రామాలయం వద్ద 8,9 డివిజన్లకు సంబంధించిన లబ్దిదారుల ఇంటింటికి వెళ్ళి పెన్లను ఆయన అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పెన్షన్ ఇచ్చి మాట నిలుపుకున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకే దక్కిందని అన్నారు. తిరుపతిలో 18,666 మంది పెన్షనర్స్ కు ఎనిమిది కోట్ల ఇరవై లక్షల పదకొండు వేల ఐదు వందల రూపాయలు అందించినట్లు ఆయన తెలిపారు. గత ప్రభుత్వంలో రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికి ఐదేళ్ళు పట్టిందని ఆయన విమర్శించారు. బటన్ నొక్కుడు పేరుతో సగం మందికి పెన్షన్లను ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పేదలందరికి ఆర్థిక తోడ్పాటు అందించడమే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ రుద్రకోటి సదాశివం, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.