మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే పురస్కరించుకొని సిపిఎం, సి ఐ టి యు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. సిఐటియు అనుబంధ క్వారీలారీ వర్కర్స్ యూనియన్ భవనం నుండి కార్మికులు ర్యాలీ నిర్వహించి ఏలేరు రిజర్వాయర్ కార్యాలయం వద్ద సీనియర్ సిఐటియు నేత ఎం అంజయ్య అరుణ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి పాకలపాటి సోమరాజు, సిఐటియు నాయకులు పిల్లా రాంబాబు, అంగన్వాడి నాయకులు కే సునీత, ఎన్ అమలావతి, పి నూకరత్నం, జె రాణి, పి దుర్గా, సూర్య కుమారి, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు కె గంగాభవాని వివిధ సంఘాల నాయకులు రౌతు సత్యనారాయణ, మాసా రామారావు, పెద్దపాటి గురవయ్యమ్మ, గండి వెంకట్రావు ఉన్నారు.