మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో గత ఎనిమిది గురువారం మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టారు.ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు,వైద్యులు సఖిరెడ్డి విజయబాబు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా సంఘ అధ్యక్షులు విజయబాబు మాట్లాడుతూ ఆంధ్ర బ్యాంకు వద్ద, ప్రభుత్వ ఆసుపత్రిలో వేసవి తాపం పెరుగుతుండడంతో రోడ్డు మీద వెళ్లే బాటసారిలకు మజ్జిగ వితరణ చేసి దాహార్తి తీర్చేందుకు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.ఈ గురువారం వరుపుల చిట్టిబాబు,తాళ్లూరు గొల్లజీరావు, రౌతు సహదేవుడు,గొల్ల నాగేశ్వరరావు ఆర్థిక సహాయంతో మజ్జిగ వితరణ చేపట్టామన్నారు.ఈ కార్యక్రమంలో జ్యోతుల నాగ శ్రీనివాస్,చక్రధర్ రావు, వాగు రాజేష్,వి సత్యనారాయణ, ముత్యాల గంగరాజు,నర్ల చిదంబరం, గొల్లపల్లి వరప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.