కడప జిల్లా గోపవరం మన న్యూస్ మే 01: బద్వేలు గోపవరం మండలాలకు చెందిన పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఎంపీడీవో రామనాథరెడ్డి బుధవారంతెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోపవరం మండలంలో 25 83 మంది పింఛన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు.వీరికి రూ,10938500 పంపిణీ ఇస్తామన్నారు.అదేవిధంగా బద్వేలు మండలంలో 3155 మంది కి రూ,13273000 సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందన్నారు.సచివాలయ ఉద్యోగులకు బుధవారం నగదు విత్ డ్రా చేసి ఇవ్వడం జరిగిందని గురువారం ఉదయం నుండే పించన్దారుల ఇంటి వద్దనే సచివాలయ ఉద్యోగులు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.పింఛన్ల పంపిణీలో ఉద్యోగస్తులు అలసత్వం వహించరాదని,అలసత్వం వహిస్తే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రజలకు ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే తమకు తెలియజేయాలని తెలిపారు. ప్రభుత్వ పథకాల పైన ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలన్నారు.