మన న్యూస్, తిరుపతి, ఏప్రిల్ 30: చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డిసిసి బ్యాంక్) చైర్మన్‌గా అమాస రాజశేఖర్ రెడ్డి నియమితులైన సందర్భంగా, తెలుగుదేశం పార్టీ నేత మరియు తిరుపతి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ పి. భువన్ కుమార్ రెడ్డి వారిని శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం రోజున రాజశేఖర్ రెడ్డి స్వగృహానికి ప్రత్యేకంగా వెళ్లిన భువన్ కుమార్ రెడ్డి, ప్రముఖ నాయకుడు ఆనంద్ బాబు యాదవ్‌తో పాటు కూటమి నాయకులు కలిసి ఆయనకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. డిసిసి బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికవడం గర్వకారణమని వారు అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా భువన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “రాజశేఖర్ రెడ్డి ఎంతో నిబద్ధత, సేవాభావంతో పనిచేస్తున్నారు. ఆయన నియామకం ద్వారా జిల్లా సహకార రంగానికి మరింత బలం చేకూరనుంది. భవిష్యత్తులో ఆయన మరెన్నో కీలక పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం,” అని తెలిపారు. పరస్పర అభినందనలు, ఆనందం మధ్య ఈ సమావేశం సాగగా, పలువురు స్థానిక నాయకులు మరియు అభిమానులు కూడా హాజరయ్యారు.