మన న్యూస్ ,మంగళగిరి/ నెల్లూరు, ఏప్రిల్ 29:ఉగ్రవాద దాడి లో మరణించిన భారతీయులకు డిప్యూటి సి ఎం పవన్ కళ్యాణ్ జనసేన సంతాప సభ అనంతరం జనసేన పార్టీ మంగళగిరి కేంద్ర కార్యాలయం లో ఏపీ టిడ్కో చైర్మన్ జిల్లా పర్యవేక్షకులు వేములపాటి అజయ్ సూచనతో నెల్లూరు జిల్లా నాయకులు కలవడం జరిగింది.సంతాప సభలో ఉగ్రవాద దాడిలో మరణించిన జనసేన క్రియాశీలక సభ్యులు సోమిశెట్టి మధుసూదన్ కి జనసేన పార్టీ తరఫున ప్రమాద బీమా తో వచ్చే ఐదు లక్షలతో సంబంధం లేకుండా 50 లక్షలు పరిహారం అందిస్తామని తెలపటం జనసైనికులకు మరింత బాద్యత నిచ్చిందని,ఈ విషయం హర్షనీయం అని తెలిపారు.అదే విధంగా ప్రభుత్వం తరఫున అందవలసిన పరిహారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అందజేస్తారన్న సంగతి విదితమే...ఈ కార్యక్రమం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున యాదవ్, జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి,జిల్లా కార్యాలయం ఇన్చార్జి జమీర్,జనసేన నాయకులు బోను బోయిన ప్రసాద్,రిషికేష్ యాదవ్,కాకు మురళి రెడ్డి,వెంకటసుబ్బయ్య, జిల్లా అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు రవికుమార్,జిల్లా సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.