ప్రత్తిపాడు మన న్యూస్ (అపురూప్) : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకునిగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ముదునూరి మురళి కృష్ణంరాజుని నియమించారు.ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ,నియోజకవర్గంలో ఆపదలో ఉన్న వారికి అపన్నహస్తం అందిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజుని నరసాపురం పార్లమెంట్ పరిశీలకునిగా నియమించడం పట్ల అభిమానులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.