మన న్యూస్, నెల్లూరు రూరల్, ఏప్రిల్ 29: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని సౌత్ మోపూర్ గ్రామంలో 16లక్షల రూపాయల వ్యయంతో సౌత్ మోపూర్ గ్రామ జడ్పీ హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు మంగళవారం శంకుస్థాపన చేసిన మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సౌత్ మోపూర్ గ్రామంలో ఇప్పటికే దాదాపు కోటి 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. రాబోవు రోజుల్లో శాససభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు.నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇందుకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి నా ప్రత్యేక ధన్యవాదాలు అని టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. పై కార్యక్రమంలో మండల కన్వీనర్ పముజుల ప్రదీప్, టిడిపి నాయకులు రాపూరు శేఖర్, ఉప సర్పంచ్ సల్లా నరసయ్య, టిడిపి నాయకులు భాస్కర్, అన్నం సుధాకర్ గౌడ్, ఆరెద్దుల మణి, హై స్కూల్ పేరెంట్ కమిటీ చైర్మన్ తుళ్లూరు పెంచలయ్య, నీటి సంఘం అధ్యక్షుడు తుళ్లూరు రామయ్య, నీటి సంఘం ఉపాధ్యక్షులు కండే అశోక్, టిడిపి నాయకులు చీమల సుధాకర్, పెళ్లూరు రవీంద్ర, పముజుల గోపాలయ్య, దేరంగుల వెంకటేశ్వర్లు, బట్ట కార్తీక్, ఉంటా శివయ్య, పడవల మురళి, పముజుల సతీష్, శివ, పారుతూరి వెంకయ్య, పనేం సునీల్, మందల మస్తానయ్య, బండ్ల గోపాలయ్య, అనిల్, రాపూరు ప్రశాంత్, చల్లా చైతన్య, సాదేపల్లి విజయ భరత్, తిప్పన కామాక్షయ్య, జి.శేఖర్ సుమంతు, బండి వెంకట రమణ, పులికొండ గిరి, తరకాల కృష్ణయ్య, రాపూరు రవికుమార్,ఎస్.కె. రసూల్, శ్రీహరి, తురక తేజ, మన్నవరపు నరసయ్య, మన్నవరపు సుధాకర్, పెంచలయ్య, బిరుదులు పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.