ప్రత్తిపాడు/మన న్యూస్ (అపురూప్): కాకినాడ జిల్లా ప్రత్తిపాడుమండలం టీ రాయవరం గ్రామానికి చెందిన ఎద్దు లోవరాజు కుమారుడు, ఎద్దు లక్ష్మీనారాయణ (15)ను తన తల్లి చదువుకోమని మందలించడంతో కోపగించిది 27_4_25వ తేదీన ఇంట్లో నుండి సైకిల్ పై పరారయ్యాడు. కోపంతో వెళ్లిన తమ కుమారుడు ఎంతసేపటికీ ఇంటికి రాక పోవడంతో తల్లిదండ్రులు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు.విషయం తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతం తమ సిబ్బందితో ప్రత్తిపాడు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు.ప్రత్తిపాడులో ఉన్న యువకుడును గుర్తించి అదుపులోకి తీసుకొని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషంతో ఎస్ఐ లక్ష్మీ కి కృతజ్ఞతలు తెలిపారు. కంప్లైంట్ పెట్టిన కొన్ని గంటల్లోనే యువకుడు ఆచూకీ కనిపెట్టిన ఎస్సై లక్ష్మీకాంతాన్ని పలువురు అభినందించారు..