మన న్యూస్, నెల్లూరు,ఏప్రిల్ 28 :
విచ్చలవిడితనం లెక్కలేని తనం కొంతమంది యువతకి ఫ్యాషన్ అయిపోయింది తల్లిదండ్రులు కట్టడి చేయాల్సిన అవసరము ఉంది.
జిల్లా ఎస్పీ, నగర డిఎస్పీ, ఎన్నో తనిఖీలు కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ… సమాజంలో ఎలా ప్రవర్తించాలి అనే బాధ్యతను కుటుంబ సభ్యులు పిల్లలకు నేర్పించవలసిన ఆవశ్యకత ఉంది అని జనసేన నాయకులు గునుకుల కిషోర్ అన్నారు.జిల్లా పర్యవేక్షకులు ఏపి టిడ్కో చైర్మన్ శ్రీ వేములపాటి అజయ్ సూచనల తోఎండ తీవ్రత పెరుగుతున్న నేపద్యం లో నగర కూడలి లో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయవలసిన బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ పవన్ కళ్యాణ్ తెలిపినట్లుగా ఎంతోమంది పేదలకు ఉచితంగా అన్నం వడ్డించిన డొక్కా సీతమ్మ పేరున మజ్జిగ చలివేంద్రం నెల్లూరు సిటీ,16 డివిజన్ చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా నెల్లూరు సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్ సతీమణి 16 డివిజన్ మహిళా నాయకురాలు గునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనసేన నాయకులు,వీరమహిళలు జనసేన మద్దతుదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ……..అస్వస్థ తో ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతను ముందుకు నడిపిస్తూ వేములపాటి అజయ్ సూచనలతో విజయలక్ష్మీ ఈ రోజు ఇక్కడ మజ్జిగ చలివేంద్రాన్ని నిరంతరాయంగా 90 రోజులు ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన నాయకులకు జనసైనికులకు మహిళలకు మా మద్దతుదారులకు అందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేశారు.
నగరంలో క్రైమ్ పెరిగిపోయింది యువతని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అని అన్నారు.గత వారం రోజులుగా త్రిబుల్ రైడ్ లో ఉన్నాము.లైట్ గా మందు తాగి ఉన్నారనో…ఎవరో కొట్టుకున్నారు మా పిల్లోడు అందులో లేడు పలు సమస్యలు దృష్టికి వచ్చాయి అని అన్నారు.
వయసులో ఉన్న యువతకి కత్తులు,మద్యం అవసరత లేదని రాత్రిపూట వీధుల్లో తిరగరాదని పెద్దలు తెలిపి జాగ్రత్త పడాలి అని తెలియజేశారు.చదువు రీత్యా దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చేసి వాళ్ళు వివరాలు సమాచారం తెలుసుకొని జాగ్రత్త పడేటట్టు చేయాలి అని అన్నారు.ఒక్కసారి నేర చరిత్ర పైన పడితే అటెంప్ట్ మర్డర్ గాని మర్డర్ కేసులో విషయంలో గానీ జీవితకాలం బాధపడవలసి ఉంటుంది అని తెలియజేశారు.ఇప్పటికిప్పుడు వాటి శిక్షలు అమలుఞకాకపోయినా ఐదు పది సంవత్సరాల తర్వాత అయినా ప్రస్తుతానికి బయటకు వచ్చినప్పటికీ హత్య విషయంలో జీవితకాల ఖైదును అనుభవించాల్సి వస్తుంది అని అన్నారు.అప్పుడు గతంలో ఈ వయసులో ఉన్నప్పుడు ఎందుకు తప్పులు చేశామా భావిస్తున్న చాలా మందిని నేను చూశాను అని తెలియజేశారు.కాబట్టి దయచేసి యువతను కట్టడి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేనసిటి నాయకులు గునుకుల కిషోర్,16వ డివిజన్ వీర మహిళ నాయకురాలు గునుకుల విజయలక్ష్మి, 16వ డివిజన్ నాయకులు విశ్వనాథ్, నరహరి,జనసేన నాయకులు సుధా మాధవ్,కారంపూడి కృష్ణారెడ్డి,ఏటూరి రవికుమార్,గుర్రం కిషోర్,కేదారి మనోజ్,శివ,పెనేటి శ్రీకాంత్,కవితా,శాంభవి, శ్యామల,ధనలక్ష్మి,,ప్రసన్న,ప్రవల్లిక,రమణి,సౌమ్య, శరవణ,బాలు,యాసిన్,ఆబిద్,శివ,హరి,సుధాకర్,తెలుగుదేశం నాయకులు యశ్వంత్,రాజా,బాలాజీ
తదితరులు పాల్గొన్నారు.