మన న్యూస్,నిజాంసాగర్, ( జుక్కల్ )14 ఏప్రిల్ 2025 నుండి మీ సేవా కేంద్రంలో భూ సమస్యలపై దరఖాస్తు సమర్పిస్తే భూభారతి చట్టం ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని
భూ భారతి చట్టం పై జిల్లాలోని ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతీ మండల కేంద్రంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు.సోమవారం నిజాంసాగర్ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో, మహమ్మద్ నగర్ రైతువేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. భూభారతి చట్టం 14 ఏప్రిల్ 2025 న ప్రారంభించడం జరిగిందని చట్టం పై ప్రజలకు,రైతులకు అవగాహన సదస్సుల ద్వారా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ధరణీ స్థానంలో భూ భారతి భూమి హక్కుల చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు.ఇందులో అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయని, హక్కుల రికార్డులలో తప్పుల సవరణ చేసుకోవచ్చని, రిజిస్ట్రేషన్,మ్యుటేషన్ చేయడానికి ముందు భూముల సర్వే,పెండింగ్ సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం జరుగుతుందని, 2014 జూన్ 2 కంటే ముందు గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని సాదా బైనామ ద్వారా కొనుగోలు చేసిన క్రమబద్దీకరణ కోసం రైతులు పెట్టుకున్న దరఖాస్తులపై ఆర్డీఓలు విచారణ చేసి అర్హత ఉన్న వారి నుండి ప్రస్తుత రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు.రికార్డు లలో నమోదు చేసి పట్టాదారు పాసు పుస్తకం ఇస్తారని తెలిపారు.వారసత్వంగా వచ్చిన భూములకు మ్యుటేషన్ చేసే ముందు నిర్ణీత కాలంలో విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు.పాసు పుస్తకాలలో భూమి పటం,భూముల సమస్యలు పరిష్కారానికి రెండు అంచెల అప్పీల్ వ్యవస్త ఉంటుందని తెలిపారు. తహసీల్దార్ చేసిన మ్యుటేషన్లపై లేదా జారీచేసిన పాసుపుస్తకాలపై అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకు అప్పీలు చేసుకోవచ్చని,ఆర్డీఓ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని,కలెక్టర్ ఇచ్చిన తీర్పు పై అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఆధార్ తరహాలో రైతులకు భూదార్ కార్డుల జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.రైతులకు ఉచిత న్యాయ సహాయం అందించడం జరుగుతుందని తెలిపారు.ఇట్టి చట్టంలో ఏమైనా అభ్యంతరాలు, అనుమానాలు ఇంతే నివృత్త చేసుకోవచ్చని తెలిపారు. గతంలో ధరణీలో అప్పీలు కు ఆస్కారం లేనందున సివిల్ కోర్టుకు వెళ్ళవలసి ఉండేదని, ప్రస్తుతం తహసీల్దార్ ఇచ్చిన తీర్పులో అభ్యంతరం ఉంటే ఆర్డీఓ కు,ఆర్డీఓ తీర్పులో అభ్యంతరం ఉంటే కలెక్టర్ కు అప్పీలు చేసుకోవచ్చని కలెక్టర్ ఇచ్చిన తీర్పు అభ్యంతరం ఉంటే భూమి ట్రిబ్యునల్ కు అప్పీలు చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. హక్కుల రికార్డుల్లో ఉన్న వ్యక్తి లైసెన్సు గల సర్వేయర్ తో భూమి సర్వే చేయించుకొని మ్యాప్ తయారు చేయించుకున్నట్లయితే మండల సర్వేయర్ సరి చూసిన తర్వాత తహసీల్దార్ పాసుపుస్తమలో సర్వే మ్యాప్ ను ఉంచడం జరుగుతుందన్నారు.ఏ మైన భూ సమస్య ఉంటే సదరు పార్టీలకు నోటీసులు జారీ చేయాలని ఎవిడెన్స్ రికార్డు చేయాలనీ స్పీకింగ్ ఆర్డర్స్ స్పష్టమైన రీమార్కులతో నమోదు చేయాలని తెలిపారు. ప్రస్తుతం మీ సేవలో దరఖాస్తు పెడితే భూభారతి చట్టం ప్రకారం విచారణ చేపట్టి నిర్ణీత సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.దీర్ఘకాలిక సమస్యలపై విచారణ చేసి స్పీకింగ్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. భూభారతి చట్టం లింగంపేట్ మండలంలో పైలెట్ ప్రాజెక్ట్ కింద అమలు జరుగుచున్నదని తెలిపారు. ప్రజలందరూ భూ భారతి పై అవగాహన కల్పించుకోవాలని అన్నారు.అంతకముందు నిజాంసాగర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, మండల అధ్యక్షులు రైతులతో కలిసి ఎడ్లబండ్లపై తహసీల్దార్ కార్యాలయం వరకు వచ్చిన కలెక్టర్ ఎమ్మెల్యే కు సంజీవ్ పంతులు బొట్టును పెట్టారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,చికోటి మనోజ్ కుమార్,మండల ప్రత్యేక అధికారి ప్రమీల, నిజాంసాగర్,మొహమ్మద్ నగర్ మండల అధ్యక్షులు ఏలే మల్లికార్జున్,రవీందర్ రెడ్డి,తహసీల్దార్ లు బిక్షపతి,సవాయి సింగ్,ఎంపిడిఓ గంగాధర్,మండల వ్యవసాయ అధికారి అమర్ ప్రసాద్, మహమ్మద్ నగర్ మండల వ్యవసాయ అధికాణి నవ్య,రైతులు నాయకులు తదితరులు ఉన్నారు.