మన న్యూస్,నెల్లూరు,ఏప్రిల్ 28: నెల్లూరు 42 వ డివిజన్ కోటమిట్ట మున్సిపల్ పార్కులో పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన మైనార్టీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల పంపిణీ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 42 వ డివిజన్ వైస్సార్సీపీ నాయకులు అబ్దుల్ మస్తాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక నేతలు, ప్రజలు తరలివచ్చారు.ఈ సందర్బంగా 110 మంది మైనార్టీ విద్యార్థులకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ప్రతిభ పురస్కారాలు అందజేసి సత్కరించారు.పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ…… అబ్దుల్ మస్తాన్ ప్రతిభా పురస్కారాలు పంపిణి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈరోజు విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ తెలుసుకొని.. వారి పిల్లల్ని బాగా చదివిస్తున్నారని తెలిపారు.చదువుకున్న ప్రతి ఒక్కరికి.. విద్య, ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. పేద విద్యార్థులు ఉన్నత స్థాయిలో చదువుకోవడానికి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బీజం వేశారని.. వారి కృషి ఫలితంగా ఈరోజు ఎంతోమంది ఇంజనీర్లుగా డాక్టర్లుగా సైంటిస్టులుగా వారి వారి వృత్తుల్లో స్థిరపడి దేశానికి సేవలందిస్తున్నారని తెలిపారు. తాను 27 సంవత్సరాల నుంచి విద్యా సంస్థలు నడుపుతున్నానని.. పేద విద్యార్థులు చదువుకునేందుకు తమ కళాశాలలో అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా, వైఎస్ఆర్సిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఖలీల్ అహ్మద్, వైసిపి రాష్ట్ర మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు హంజా హుస్సేని, రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లి నిర్మల, రాష్ట్ర మేధావుల ఫోరమ్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్,జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణా రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సిద్దిక్,ముస్లిం సంచార జాతుల విభాగం అధ్యక్షులు బాబా భాయ్, జిల్లా యాక్టివిటీ కార్యదర్శి మున్వర్, స్థానిక వైసీపీ నేతలు జమీర్, షాకీర్ yasddaani, తౌఫిక్, బాలకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.