గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఐజ అఖిలపక్ష కమిటీ తరఫున గత కొన్ని సంవత్సరాల క్రితం గురుకుల విద్యాలయం ఐజ మండల కేంద్రానికి మంజూరి అయింది. దాన్ని ప్రభుత్వ హైస్కూల్లో నిర్వహించారు. కానీ ఇక్కడ సరైన వసతులు లేదని నేపథంతో ఇక్కడి నుండి ఎర్రబెల్లి చౌరస్తాలో మార్చారు. అక్కడ కూడా అరకొర వసతులతో ప్రైవేట్ బిల్డింగ్లో చాలీచాలని స్థలంలో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు ఐజలో పెద్ద బిల్డింగ్ గురుకుల విద్యాలయం కోసం ఇస్తామని కలెక్టర్ వద్ద గురుకుల అధికారుల వద్ద మీ వద్ద ప్రతిపాదించిన విషయం తమరికి తెలిసిందే. ఈ విషయమై ఎస్వీఎం బిల్డింగ్ యజమానితో, ఇటు అధికారులతో అటు ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని ఎంపీ తో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ తరపున ఇంచార్జి గౌరవనీయులు సంపత్ కుమార్ , ఎమ్మెల్యే విజయుడు , ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి , స్థానిక ప్రజాప్రతినిధులు గురుకుల విద్యాలయాన్ని ఐజకు మార్చమని ప్రతిపాదించారు. కావున ఈ రకమైన చర్యలను వేగవంతం చేయడానికి మీరు బాధ్యతతో ఇక్కడి ప్రజల కోరికను మన్నించి ఈ విద్యా సంవత్సరంలోగా ఐజకు రప్పించుటకు చర్యలు చేపడతారని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు చాకలి ఆంజనేయులు, నాగరదొడ్డి వెంకట రాములు, పీజీకే వెంకటేశ్వరరావు, దండోరా ఆంజనేయులు, ఎస్పి హనుమంతు, మెడికల్ తిరుమల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, గోపాలకృష్ణ, లక్ష్మణ గౌడ్, బలిగెర యేసురాజు, తూముకుంట కిష్టన్న, విజయ్, వీరారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.