గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 28 :- నిన్న సాయంకాలం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గంలో అకాల వర్షం కారణంగా మామిడి తోటలు, వరి వడ్లు, వివిధ గ్రామాలలో మూగ జీవాలు పిడుగుల కు మరణించడం జరిగింది. గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని కొండాపురం గ్రామంలో అకాల వర్షం కారణంగా రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరగడంతో ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పర్యటించి రైతుల యొక్క మామిడి తోటకు వెళ్లి తోట లో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా వరి కల్లాలను వానకు తడిసిన వరి ధాన్యము ను ఎమ్మెల్యే పరిశీలించడం జరిగింది. అనంతర ధరూర్ మండల కేంద్రము వరి ధాన్యము కొనుగోలు సెంటర్ ను ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సందర్శించి ధాన్యమును పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కొనుగోలు కేంద్రం దగ్గర రైతులతో మాట్లాడి వారి సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకోవడం జరిగింది. గన్ని బ్యాగుల సమస్యలతో రైతుల ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుసుకుని వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా మాట్లాడి రైతులకు అలాంటి ఇబ్బంది లేకుండా గన్ని బ్యాగులను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ :- అకాల వర్షం కారణంగా గద్వాల నియోజకవర్గం లోని పలు గ్రామాలలో రైతులు వరి ధాన్యమును వర్షానికి తడి పోవడం జరిగింది. సంవత్సరం నుండి వేసిన మామిడి తోటలు కూడా మామిడి కాయలు రాలిపోవడం తో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరిగింది దాదాపుగా 25 లక్షల వరకు రైతులకు నష్టం రావడంతో రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సీఎం వ్యవసాయ శాఖ మంత్రి వెంటనే అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని. ఏ గ్రామాలలో రైతులు నష్టపోయిన సంబంధిత అధికారులతో పూర్తి నివేదికను తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.
ఎన్నో ఏళ్లుగా రైతులు మామిడి తోటలు పండించడం జరుగుతుంది. సరిగ్గా మామిడి తోట చేతికి వచ్చే సమయానికి అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట మొత్తం నాశనం కావడం జరిగింది కావున ప్రభుత్వం మామిడి తోట రైతులను కూడా ఆదుకోవాలని వారికి అండగా నిలవాలని కోరారు. అదే విధంగా గద్వాల నియోజకవర్గం ఉరుములు మెరుపులు అకాల వర్షం కారణంగా పలు గ్రామాలలో మూగ జీవాలు, ఆవులు బర్రెలు, ఎద్దులు మేకలు గొర్రెలు కూడా మరణించడం జరిగింది. కావున ప్రభుత్వం వాటికి కూడా ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని కోరారు. ఎవరు కూడా అదే ఏర్పడొద్దండి ఆందోళన చెందవద్దండి ప్రభుత్వం తరఫున నష్టపోయిన వారికి నష్టపరిహారం వచ్చే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి వ్యవసాయ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రతి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటానని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ కురువ హనుమంతు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజశేఖర్ మాజీ వైస్ ఎంపీపీ రామకృష్ణ నాయుడు, నాయకులు ఉరుకుందు, శేఖర్ రెడ్డి, రాజేష్,చంద్రశేఖర్, డి.వై రామన్న, శేఖర్ రెడ్డి, తిమ్మారెడ్డి, గోపి , పవన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.