Mana News :-తిరుపతి జిల్లా పాకాల మండలం తోటపల్లి వద్ద పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుమలకు బయలుదేరిన కారులో ఉన్న ఏడుగురు భక్తులు, ఓవర్టేక్ ప్రయత్నంలో కారు అదుపుతప్పి ఎదురుగా వచ్చిన కంటైనర్ కిందకి దూసుకుపోయింది. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఓ వృద్ధుడు, ఓ చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు. కారు అధిక వేగమే ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.