జలదంకి, మన న్యూస్ : జలదంకి మండలం కమ్మవారి పాలెం గ్రామంలో ఆదివారం టిడిపి గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ హాజరయ్యారు. మండలం మరియు గ్రామ నాయకుల సమక్షంలో ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ఆధ్వర్యంలో టిడిపి గ్రామ కమిటీలను ఎంపిక చేశారు. ఐక్యంగా గ్రామ స్వరాజ్యం కోసం పాటుపడాలన్నారు. అభివృద్ధిని అడ్డుకునే వారిని ఉపేక్షించేది లేదన్నారు. గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్వో ప్లాంట్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ కమిటీలు పార్టీ, మరియు గ్రామ అభివృద్ధికి శ్రీకారం చుట్టాలన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ మధుమోహన్ రెడ్డి పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామ నాయకులు మహిళలు టీడీపీ కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.