మనన్యూస్,జోగులాంబ:గద్వాల జిల్లా వ్యాప్తంగా భారీ ఈదురు గాలుల నేపథ్యంలో అనేక చోట్ల చెట్లు నెలకొరిగాయి.
గద్వాల పట్టణం న్యూస్ హోసింగ్ బోర్డు కాలనీలో వేప చెట్టు,20 వ వార్డు లో భారీ వృక్షం, విశ్వవేశ్వరయ్య పాఠశాల ఆవరణలో 40 యేండ్ల వృక్షం నెలకొరోగగా, గద్వాల నుండి రాయచురు కు వెళ్లే మార్గంలో ఒక వృక్షం,దౌదర్ పల్లి కు వెళ్లే మార్గంలో ప్రగతి స్కూల్ దగ్గర ఒక చెట్టు,
మల్దకల్ మండలంలోని అమరవాయి బూడిదపాడు మధ్యలో భారీ వృక్షం, బిజ్వరం గ్రామంలో ఇంటి పై కప్పు కులీ భారీ నష్టం సంబవించనట్లు ఇంటి యజమాని తెలిపారు. కేటీదొడ్డి మండలంలోని చింతలకుంట గ్రామంలో రైతు బోయ రామకృష్ణ కు చెందిన ఎద్దు పిడిగుపాటుకు మృతి,కొండాపురం గ్రామంలో రెండు బర్రెలు మృతి మృతి చెందాయి. ఈ భారీ ఈదురు గాలులకు పలు చోట్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.