మనన్యూస్,నారాయణ పేట:అమావాస్య పర్వదినం సందర్భంగా మక్తల్ పట్టణంలోని ఆజాద్ నగర్ లో వెలిసిన శ్రీ ఉమామహేశ్వరాలయం లో అమావాస్య వేడుకలు వైభవంగా జరిగాయి. ఆదివారం అమావాస్య సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దరామయ్య స్వామి ఆధ్వర్యంలో తెల్లవారుజామున 4 గంటల నుండి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు .ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి వారికి అభిషేకాలు చేయించి మొక్కలు చెల్లించుకున్నారు. అభిషేకం విశేష పూజలు అనంతరం స్వామివారికి విశేష అలంకరణ గావించారు .అలంకరణ అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలను నిర్వహించారు. తదుపరి మహా మంగళహారతి అనంతరం బి.రవిందర్ లావణ్య దంపతులు అన్నదాన కర్తలుగా వ్యవహరించి భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చిన్న కృష్ణయ్య ,పోలేపల్లి అనంత కుమార్, బి. శ్రీనివాసులు,వాకిటి అంజయ్య , జానమొల్ల పాపిరెడ్డి, నవీన్ , పి .నాగరాజు, పెద్ద వెంకటయ్య,వంశీ ,రవి , గుడిసె మహేష్ ,కరణ్ ,గుడిగండ్ల నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.