మనన్యూస్,కాకినాడ జిల్లా:గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.శ్రీ వేగులమ్మ జాతర మహోత్సవాలు వైభవంగా ముగిసాయి. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు దత్తు.సోదరులు.. అమావాస్య, ఆదివారం కలసి రావడం.. అమ్మవారికి రజత కవచ అలంకరణ చేసి. ప్రత్యేక పూజలు చేశారు.. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారికి ఉపారాలు నైవేద్యాలు సమర్పించారు.
జాతర మహోత్సవాన్ని
దాట్ల వెంకట సుబ్రమణ్య వర్మ (జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీ.ఈ.వో) . ప్రారంభము చేశారు.గ్రామోత్సవంలో భాగంగా గరగలు, అమ్మవారి శక్తి వేషాలు, కేరళ వాయిద్యాలు ,కోలాటం బృందములతో.. ఆలయ సేవాసమితి భక్తబృందం దగ్గరుండి.. ఊరేగింపు జాతర మహోత్సవాన్ని నిర్వహించారు.