మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో డొక్కా సీతమ్మ సేవా సమితి,వివేకానంద సేవా సమితి, ఎల్ఐసి ఏజెంట్లు అసోసియేషన్, ఆర్యవైశ్య ప్లాటినం కపుల్స్,పెన్షనర్స్ అసోసియేషన్,ముస్లిం సోదరులు,పట్టణ ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ చేసి,మానవహారం నిర్వహించారు.అనంతరం ఉగ్రవాదుల దుష్ట చర్యల వల్ల మరణించిన భారతీయులకు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంఘం అధ్యక్షులు, ప్రముఖ వైద్యులు సకిరెడ్డి విజయబాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో పహాల్గామా ప్రాంతంలో పర్యాటకానికి వెళ్లిన భారతీయ పర్యాటకులను ఉగ్రవాదులు దుష్ట చర్యలకు పాల్పడి వారి ప్రాణాలు తీయడం చాలా బాధాకరమని, మన దేశం కోసం అందరూ కలిసి పయనించాలని ఒకే నినాదంతో దేశం తరఫున భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ నిర్ణయం తీసుకున్న భారతీయులందరూ కట్టుబడి ఉండాలని,ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా భారత ప్రభుత్వం చూడాలని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.