గొల్లప్రోలు ఏప్రిల్ 26 మన న్యూస్ :- గొల్లప్రోలు మండలం, దుర్గాడ గ్రామంలో.. పంచాయతన సమేత శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున చైత్రమాసం, మాస శివరాత్రి.. శని త్రయోదశి, శనివారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు.శ్రీ లలితా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చెరుకూరి వీరబాబు, దత్తు ..సోదరులు స్వామివారికి పంచామృతాలుతో, హారిద్ర, కుంకుమ, సుగంధ జలాలుతో అభిషేక నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణ నమక,చమకాలుతో,
శ్రీ సూక్త ,దుర్గాసూక్త, సహస్రనామ పారాయణ.. చేసి నీరాజన మంత్ర పుష్పములు సమర్పించారు.. ఆలయ సేవాసభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లు చేశారు…