మన న్యూస్ ఏప్రిల్ 26:=పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో గోగాడివలస మే డే స్ఫూర్తితో కార్మిక చట్టాలను కాపాడుకోవాలి శ్రామిక మహిళ నాయకురాలు సిఐటియు నాయకులు కే పార్వతీదేవి కోరాడ ఈశ్వరరావు ఆధ్వర్యంలో కరపత్రం విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గ చరిత్రను మేడే ప్రాధాన్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఎనిమిది గంటల పని దినం కోసం ప్రాణాలర్పించినటువంటి వీరులను స్మరించుకుంటూ పోరాడి సాధించుకున్న హక్కుల్ని కాపాడుకోవాలని అన్నారు. ఎలాంటి సుబ్రహ్మణ్యం లాంటి వారు రోజుకి 18నుండి 20 గంటలు పైగా పని చేయాలని ఆదివారం సెలవులు దండుగ అనడం వెనక కార్పోరేట్లు బహుజాతి కంపెనీలు ప్రయోజనాలు దాగి ఉన్నాయని కార్మికులు తెలుసుకోవాలని కోరారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా పని భారం పెంచి చాలీచాలని వేతనాలతో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి కార్మికులు పట్ల కార్పోరేట్లు పని భారం పెంచుతూ లాభాలు పొందుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం ఇటువంటి పరిస్థితుల్లో మే 20వ తేదీన జరిగినటువంటి సమ్మె విజయవంతం ప్రతి ఒక్కరు కథలాలని పిలుపునిచ్చారు మనిషి మనిషిగా బతకాలంటే ఎనిమిది గంటల పని ఎనిమిది గంటల విశ్రాంతి ఎనిమిది గంటలు జనసేన ఉండాలి అంతకంటే ఎక్కువ పని చేసిన పనిలో నాణ్యత ఉండదు. మానసిక ఆరోగ్యం విశ్రాంతి అవసరం ఇది సైన్స్ కానీ పెట్టుబడుదారులు అత్యధికంగా లాభాలు గడించే క్రోనీ క్యాపిటల్ ఉన్నారు అందుకే ఎలాంటి సుబ్రహ్మణ్యం లాంటి వారితో ఆ విధంగా అనిపించి కార్మికుల పట్ల నిర్లక్ష్యం ధారణతో పని భారం పెంచేందుకు కార్మిక చట్టాల్లో మార్పు తీసేయడానికి ప్రయత్నం చేయడం దుర్మార్గం అందుకనే ఇటువంటి పరిస్థితుల్లో కార్మిక చట్టాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది అందుకనే అన్ని రంగాల్లో ఉన్నటువంటి కార్మికులు 20వ తేదీన జరిగిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మిక సంఘాల పిలుపులో ఆరోజు మనం చేసినటువంటి పోరాట కార్యక్రమం కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరికగా ఉండాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి సుప్రీంకోర్టు తీర్పును అమలు చేసే విధంగా ఆ పోరాటం ఈరోజు ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి గంగరాజు ఐద్వానాయకురాలు హెచ్ బంగారమ్మ కె లక్ష్మి ఆశ యూనియన్ నాయకులు బి కే లక్ష్మి సుజాత తదితరులు పాల్గొన్నారు.