మన న్యూస్,తిరుపతి :- తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని శ్రీదేవపట్ల హరినాథ్ రెడ్డి డిగ్రీ అండ్ పీజీ కళాశాల ( ఎస్ డి హెచ్ ఆర్) 215 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు విద్యాసంస్థల చైర్మన్ డివిఎస్ చక్రవర్తి రెడ్డి తెలిపారు. శనివారం ఎస్ డి హెచ్ ఆర్ విద్యాసంస్థల ప్రాంగణంలో కాంగ్నిజెంట్ ఆల్ సెట్ బిజినెస్ సొల్యూషన్స్, ఒమేగా హెల్త్, ఏజీఎస్ హెల్త్, నో బ్రోకర్ సంస్థలు జాబ్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ జాబ్ సెలక్షన్ తమ కళాశాలలో వివిధ గ్రూపులలో విద్యను అభ్యసిస్తున్న 215 మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ ఉష తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులు కోర్సు పూర్తి అయిన వెంటనే ఉద్యోగాలలో జాయిన్ అవుతారని ప్రిన్సిపల్ ఏ ఉష తెలిపారు. బెంగళూరు చెన్నై హైదరాబాదులలో ఉద్యోగాలు చేసే అవకాశం లభించిందన్నారు. అలాగే ఉద్యోగాలకు ఎంపికైన విద్యార్థులను
ఎస్ డి హెచ్ ఆర్ విద్యాసంస్థల చైర్మన్ చక్రవర్తి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన ఉద్యమ అందించడంతోపాటు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ విద్యాసంస్థల లక్ష్యమని పేర్కొన్నారు.