మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం దుర్గా శ్రీనివాస్: మలేరియా మహమ్మారి అంతం మనతోనే అవుతుందని జై అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రధాన వైద్యురాలు ఎస్ శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవ సందర్భంగా హెల్త్ సూపర్వైజర్ టి వీరన్న పర్యవేక్షణలో సిహెచ్ఒ పి మాణిక్య కుమారి, హెచ్.వి కే దైవకృప ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించినాడే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీటి నిలువలు లేకుండా ఎప్పటికప్పుడు వాటిని తొలగించాలని వారు కోరారు. తద్వారా మలేరియా వ్యాధి వ్యాప్తి చెందడానికి కారకమైన దోమలు అభివృద్ధి కాకుండా నిరోధించవచ్చు అన్నారు. ప్రపంచ మలేరియా నిర్మూలన దినోత్సవ సందర్భంగా మలేరియా అంతం మనతోనే అనే నినాదాన్ని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది ఉన్నారు.