మన న్యూస్ ప్రతినిథి ప్రత్తిపాడు (దుర్గా శ్రీనివాస్):
భారతీయ జనతా పార్టీ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారి సూచనలు మేరకు వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన కరపత్రాలు పంపిణీ చేసి,స్థానిక ముస్లిం సోదరుల వీధిలో ముస్లిం పెద్దలు,మహిళలతో వీధి సమావేశం నిర్వహించి ,వక్ఫ్ సవరణ చట్టం 2025 లో అంశాలు,ప్రయోజనాలు గురించి వివరించడం జరిగింది.ఈ సందర్భంగా వక్ఫ్ సవరణ చట్టం ప్రజా అవగాహన ప్రోగ్రామ్ జిల్లా కో కన్వీనర్ కొల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ
దశాబ్దాలుగా పేద బడుగు బలహీనవర్గ ముస్లింలు, ముస్లిం మహిళలు, ముస్లిం యువతకి జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయడానికే వక్ఫ్ చట్టం 2025 ప్రధాని మోడీ తీసుకురావటం జరిగిందని, వక్ఫ్ ఆస్తుల ద్వారా వచ్చే సంపదని పేద ముస్లింల యొక్క వైద్యానికి, విద్యకి, ముస్లిం వితంతువులు యొక్క పోషణకి ,ముస్లిం యువతకి ఉపాధి కలిగే విధంగా చట్టాన్ని రూపొందించారని శ్రీనివాస్ అన్నారు.కన్వీనర్ సింగిలీదేవి సత్తిరాజు మాట్లాడుతూ దశాబ్దాలుగా వాళ్లకి అన్యాయం చేసి కొంతమంది దాన్ని వారి స్వప్రయోజనాలకి వాడుకున్నారని ఈ దోపిడీనీ ఈ చట్టం అరికడుతుందని, నిరుపేద ముస్లింలను ఆదుకుంటుందని అన్నారు. కేంద్ర ,రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ఇకపై తప్పనిసరిగా ఇద్దరు ముస్లిం మహిళలకు చోటు దక్కుతుందని ,వక్ఫ్ చట్టం 2025 పై అన్ని వర్గాల ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన కలిగించి ,అపోహలు తొలగిస్తామని మండల పూర్వ అధ్యక్షులు కంద వీరాస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో దేవర రామకృష్ణ, నక్క శ్రీను,తేజోమూర్తుల ఉషారాణి, సిద్ధపరెడ్డి చంద్రరావు,ముస్లిం సోదరులు,మహిళలు పాల్గొన్నారు.