మన న్యూస్ ,ఎస్ఆర్ పురం:-ఎస్ఆర్ పురం మండలం తయ్యూరు పాయకట్టు గ్రామంలో వెలసిన శ్రీ ఆరిమాని గంగమ్మ తల్లి ఆలయంలో గంగాధర నెల్లూరు మండలం అగరమంగళం గ్రామానికి చెందిన బిజెపి యువ మోక్ష అధ్యక్షుడు ఆనంద్ బాబు వారి కుటుంబం సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.అనంతరం గుడి ఆవరణంలో పొంగళ్ళు పెట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసి మొక్కును చెల్లించుకున్నారు. వీరికి ఆలయ ప్రధాన అర్చకులు వెంకటాచలం పతి ఆచార్యులు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.