మన న్యూస్,తిరుపతిః- జమ్మూకాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి జనసేన ఘనంగా నివాళులు అర్పించింది. గురువారం సాయంత్రం ఎన్డీఓ కాలనీలోని జనసేన పార్టీ కార్యాలయ ఆవరణలో పార్టీ నాయకులు మౌన నిరసన నిర్వహించారు. జనసేన పార్టీ మృతులకు నివాళిగా మూడు రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. బుధవారం పార్టీ జెండాలను అవనతం చేయడంతో పాటు కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించింది. రెండోరోజైన గురువారం జనసేన నాయకులు మౌన నిరసన వ్యక్తం చేశారు. అమాయకులైన పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్య చేయడం హేయమైన చర్య అని జనసేన నాయకులు విమర్శించారు. శుక్రవారం సాయంత్రం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మానహారం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు పెద్దఎత్తున పాల్గొనాలని ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్పోరేటర్లు ఎస్ కే బాబు, నరసింహాచ్చారి, నరేంద్ర, నాయకులు దూది శివ, తిరుత్తుణి వేణుగోపాల్, కీర్తన, సుభాషిణి, ఆకుల వనజ, బాబ్జి, హరిశంకర్, మునస్వామి, ఆర్కాట్ క్రిష్ణప్రసాద్, మనోజ్, బాలిశెట్టి కిషోర్, బండ్ల లక్ష్మీపతి, పోటుకూరు ఆనంద్, సునీల్ చక్రవర్తి, గుట్టా నాగరాజు రాయల్, మల్లిశెట్టి లక్ష్మీ, మధులత, రాధా, కోకిల, ఆముదాల వెంకటేష్, రుద్రకిషోర్, వినోద్ రాయల్ తదితరులు.