కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 26: మేడే జయప్రదం చేయాలని కోరుతూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది . ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటియుసి బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్ల నాగేష్ మాట్లాడుతూ మే ఒకటవ తారీఖున జరగబోయే కార్మిక దినోత్సవాన్ని బద్వేల్ పట్టణంలో ఒక పండగ వాతావరణాన్ని తీసుకురావాలని కార్మికులకు పిలుపునిచ్చారు. సుప్రీం కోర్ట్ నిర్ణయాల మేరకు కనీస వేతనం అమలు చేసి ఇప్పుడు ఉన్న ధరలకు అనుకూలంగా కనీస వేతనం 36వేల రూపాయలు ఇవ్వాలని ఆప్కోస్ విధానాన్ని అదేవిధంగా కొనసాగించాలని, లేకపోతే దానికి మెరుగైన విధానం తీసుకురావాలని వారు అన్నారు. మున్సిపాలిటీ రంగంలో పనిచేస్తున్న కార్మికులందరినీ పర్మినెంట్ చేసి వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు నరసింహులు, శ్రీనివాసరాజు, గురయ్యా, వెంకటరెడ్డి, ప్రసాద్, నాగరాజు, శ్రీనివాసులు, గోపి, బాబి, వై వెంకట్, రమణ తదితర కార్మికులు పాల్గొన్నారు.