శంఖవరం మన న్యూస్ (అపురూప్) ; జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో పాలనా వికేంద్రీకరణకు గుర్తుగా "మా పంచాయతీ - మా గౌరవం" పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పంచాయతీరాజ్ సదస్సును గురువారం నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అధ్యక్షతన ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు వీఆర్ కృష్ణతేజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంచాయతీరాజ్ సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కార్యదర్శి, కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పాల్గొన్నారు. ఈ సమావేశానికి కాకినాడ జిల్లా నుంచి 10 మoది సర్పంచులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేయగా వీరిలో ఒకరుగా అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజాకు ఈ అరుదైన గౌరవ అవకాశం దక్కింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కుమార్ రాజాను పలువురు అభినందించారు.