మన న్యూస్ ప్రతినిథి ఏలేశ్వరం (దుర్గా శ్రీనివాస్) ఏలేశ్వరం మండలం యర్రవరంగ్రామములో శ్రీ సరస్వతి శిశు మందిర్ విద్యాలయం నందు పేరెంట్స్ మీట్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ముక్కు సుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు సింగిలిదేవి సత్తిరాజులు హాజరయ్యారు.పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాట వీర రాఘవరావు అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమానిలో పలువురు పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు ప్రముఖులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.వచ్చే విద్యా సంవత్సరానికి ఈ పాఠశాలను మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థిని విద్యార్థులు ఉన్నత విలువలు కలిగి ఉంటారని కొనియాడారు. విద్యార్థులు చైతన్యవంతులు చేసేందుకు అహర్నిశలు పాటుపడుతున్న ఉపాధ్యాయులను అభినందించారు అనంతరం పాఠశాలలో వివిధ శ్రేణుల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిశెట్టి పరదేశి, ఎల్లపు సూర్యనారాయణ, తోట మహేశ్వరరావు, శ్రీమతి వాగు కళ్యాణి, సిఎస్ మల్లేశ్వరి, పలువురు పూర్వ విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు