శంఖవరం మన న్యూస్ (అపురూప్): రాష్ట్ర ప్రభుత్వం పదవ తరగతి ఫలితాలు బుధవారం విడుదల చేసింది.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంఖవరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ విద్యార్థినిలు ప్రతిభను కనబరిచారు. ఈ సందర్భంగా కేజీబీవీ ప్రిన్సిపాల్ బి. బాలామణి కుమారి మాట్లాడుతూ, పదవ తరగతి 39 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా 30 మంది ఉత్తీర్ణత సాధించరని తెలిపారు. కె. నవ్య శ్రీ 457/600 మార్కులు సాధించగా,ఎస్ శివ దుర్గ 444/600 మార్కులు సాధించి ప్రధమ ద్వితీయ స్థానాల్లో నిలిచి ప్రతిభను కనబరిచారు. మిగతా పదవ తరగతి విద్యార్థినిలు 11 మంది ప్రధమ శ్రేణిలోనూ 12 మంది ద్వితీయశ్రేణి ని కైవసం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థినిలను కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ సిబ్బంది పలువురు అభినందించారు.