శంఖవరం మన న్యూస్ (అపురూప్) :- శంఖవరం మండలం లోని ఏపీ మోడల్ స్కూల్, ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక స్థానం సంపాదించి, 10వ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.జోన్ 2 లో ఉన్న ఏపీ మోడల్ స్కూల్స్ ,ప్రభుత్వ పాఠశాలల రంగం లో శంఖవరం మండల మరియు పాఠశాల టాపర్ గా నిలిచిన వై.బాలమురళి 584 మార్కులు సాధించి స్కూల్ తరపున గర్వకారణంగా నిలిచారు. అలాగే, స్కూల్ స్థాయిలో ద్వితీయ స్థానం పొందిన కె. కీర్తన (563/600 మార్కులు), ఆర్. నాగలక్ష్మి (563/600 మార్కులు) తమ ప్రతిభతో ఆకర్షణగా నిలిచారు.ఇతర విద్యార్థుల ప్రదర్శన కూడా విశేషమైనది.500 కి పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 26 కాగా, 450 పైగా మార్కులు సాధించిన వారు 45 మంది.మొత్తం 81 మంది విద్యార్థులు పరీక్ష రాయగా,77 మంది ఉత్తీర్ణులు అయ్యి, 95 శాతం పాస్ పర్సంటేజ్ సాధించారు. ఫస్ట్ క్లాస్ లో 66 మంది, సెకండ్ క్లాస్ లో 7 మంది, థర్డ్ డివిజన్ లో 4 మంది విద్యార్థులు తమ స్థానాన్ని పొందారు"అని ఇన్చార్జి ప్రిన్సిపాల్ వైఎస్వీ కిరణ్ తెలిపారు. 95% విజయాన్ని సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింతగా మలిచిన విద్యార్థులకు చైర్ పర్సన్ జ్యోతి అభినందనలు తెలియజేశారు. విద్యార్థులు తమ పట్టుదలతో తమ ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. అని శంఖవరం మండల విద్యాశాఖ అధికారి ఎస్వీ రమణ కొనియాడారు. స్కూల్ టీచర్ల కృషి, విద్యార్థుల పట్టుదలతోనే ఈ గొప్ప విజయాలు సాధ్యమయ్యాయి" అన్ని మండల విద్యాశాఖ అధికారి 2 టి. గోవింద్ అభినందించారు.ఈ విజయాల వెనుక విద్యార్థుల కష్టపడి సాధించిన పట్టుదలను, టీచర్లు మరియు సిబ్బందితో పటిష్టంగా పనిచేసిన విధానాన్ని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి పర్వత సురేష్ కొనియాడారు.